మోదీ ప్రభుత్వం మరో టోకరా..

SMTV Desk 2019-01-24 15:23:09  Narendra Modi, Piyush Goyal, chidambaram, railway deportment, Railway jobs, Recruitment Drive, tweet

న్యూఢిల్లీ, జనవరి 24: కేంద్ర ప్రభుత్వం భారత రైల్వే సంస్థలో నాలుగు లక్షల ఉద్యోగాల భర్తీపై జారీ చేసిన ప్రకటనపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పీ చిదంబరం స్పందించారు. ఇది మోదీ ప్రభుత్వ కొత్త మోసపు ఎత్తుగడగా ఆయన వర్ణించారు. గడిచిన ఐదు సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న పోస్టులపై రైల్వే శాఖ హఠాత్తుగా మేలుకొందని ఎద్దేవా చేశారు. గత ఐదేళ్లుగా రైల్వేల్లో 2,82,976 పోస్టులు ఖాళీ ఉంటే కేంద్రం ఇప్పుడు హఠాత్తుగా ఈ పోస్టులు భర్తీ చేస్తామని మరో మోసంతో ముందుకొస్తోందని చిదంబరం ట్వీట్‌ చేశారు.



అయితే ప్రభుత్వ శాఖలన్నింటిలో ఎలాంటి పరిస్ధితే ఉందని అన్నారు. పోస్టులన్నీ ఓవైపు ఖాళీగా ఉంటే, మరోవైపు నిరుద్యోగ యువత నిరాశలో కూరుకుపోతున్నారని విచారానికి గురయ్యారు. కాగా 2021 నాటికి రైల్వే శాఖలో నాలుగు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ బుధవారం పేర్కొన్నారు. రానున్న రెండేళ్లలో 2.3 లక్షల ఖాళీలను భర్తీ చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు.