రాష్ట్రాన్ని వణికిస్తున్న స్వైన్ ఫ్లూ

SMTV Desk 2019-01-23 19:24:04  Swine flu, Telangana state, Secundrabad, Gandhi hospital

హైదరాబాద్, జనవరి 23: తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ స్వైన్ ఫ్లూ వణికిస్తోంది. నగరాల్లో రోజు రోజుకి స్వైన్ ఫ్లూ భాదితులు అధిక సంఖ్యలో పెరుగుతున్నారు. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో తాజాగా వొకేరోజు ఐదు కేసులు నమోదయ్యాయి. వీరిలో ముగ్గురు మహిళలు కాగా, ఇద్దరు పురుషులు ఉన్నారు. వీరిలో నలుగురు హైదరాబాద్‌కు చెందగా, మరొకరు ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తిగా వైద్యులు పేర్కొన్నారు. మరో ఐదుగురికి స్వైన్‌ ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అలాగే, వరంగల్‌లోనూ స్వైన్‌ ఫ్లూ లక్షణాలు ఉన్న బాధితులను గుర్తించారు. బాధితులను ప్రత్యేక వార్డులలో ఉంచి వైద్యులు చికిత్స అందజేస్తున్నారు. వాతావరణంలో మార్పుల కారణంగానే ఈ వ్యాధి వ్యాప్తి చెందుతున్నట్లు వైద్యులు గుర్తించారు. చిన్నారులు, బాలింతలు, గర్భిణులు, వృద్ధులు జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు. మరోవైపు, నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో రాష్ట్రంలో చలి తీవ్రత అధికంగా ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా స్వైన్‌ ఫ్లూ వ్యాధి విజృంభించకుండా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. తాజాగా, చలికాలం తీవ్రత తగ్గి వేసవి తాపం క్రమక్రమంగా పెరుగుతుండటంతో పాటు వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాలలోని ప్రధాన ఆసుపత్రులు మొదలు గ్రామీణ ప్రాంతాలలోని ప్రాదజమిక ఆరోగ్య కేంద్రాలలో స్వైన్‌ ఫ్లూకు సంబంధించిన మందులను అందుబాటులో ఉంచుతున్నారు.

ఆసుపత్రికి వచ్చే ఎవరినైనా అన్ని పరీక్షలు నిర్వహించాలనీ, వొకవేళ స్వైన్‌ ఫ్లూ లక్షణాలు కనిపించిన పక్షంలో రక్త నమూనాలను ఐపీఎంకు పంపడంతో పాటు ఆ వ్యక్తి వివరాలను ప్రత్యేకంగా ఉంచాలని వైద్యా సిబ్బందికి, సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వ్యాధి నిర్ధారణ అయిన వ్యక్తి ప్రైవేటు ఆసుపత్రిలో చేరడానికి అంగీకరించని పక్షంలో రాజధానిలోని గాంధీ ఆసుపత్రికి తరలించాలని కోరుతున్నారు. అన్ని ఆసుపత్రులలోని వైద్యులు కూడా స్వైన్‌ ఫ్లూ పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా అన్ని బోధనా కళాశాలలు, జిల్లా, ఏరియా ఆసుపత్రులలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుతున్నారు. అవసరమెనౖన్ని మెడికల్‌ కిట్లు ప్రైవేటు ఆసుపత్రులలో కూడా పంపిణీ చేశారు. అలాగే, వ్యాధి నిర్ధారణకు సంబంధించి అన్ని పరీక్షలను ఉచితంగానే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో నిర్ధారణ కిట్లతో పాటు మందులను సైతం అందుబాటులో ఉంచింది. మరోవైపు, స్వైన్‌ ఫ్లూలోనూ సాధారణ ఫ్లూ లక్షణాలే కనిపిస్తాయనీ, జ్వరం, ముక్కు కారడం, గొంతునొప్పి, తలనొప్పి, వొళ్లు నొప్పులు ఉంటాయనీ, సాధారణ ఫ్లూ జ్వరాలు మూడు రోజులలో తగ్గిపోతాయనీ, అంతకంటే ఎక్కువ రోజులు వేధిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు. అలాగే, శంషాబాద్‌ విమానాశ్రయంలోనూ ప్రత్యేక స్వైన్‌ ఫ్లూ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చిపోయే ప్రయాణికుల నుంచి ఈ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉన్న దృష్ట్యా అక్కడే అనుమానితులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

అలాగే, రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాలలోని ప్రధాన ఆసుపత్రులు మొదలు గ్రామీణ ప్రాంతాలలోని ప్రాదజమిక ఆరోగ్య కేంద్రాలలో స్వైన్‌ ఫ్లూకు సంబంధించిన మందులను అందుబాటులో ఉంచుతున్నారు. ఆసుపత్రికి వచ్చే ఎవరినైనా అన్ని పరీక్షలు నిర్వహించాలనీ, వొకవేళ స్వైన్‌ ఫ్లూ లక్షణాలు కనిపించిన పక్షంలో రక్త నమూనాలను ఐపీఎంకు పంపడంతో పాటు ఆ వ్యక్తి వివరాలను ప్రత్యేకంగా ఉంచాలని వైద్యా సిబ్బందికి, సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వ్యాధి నిర్ధారణ అయిన వ్యక్తి ప్రైవేటు ఆసుపత్రిలో చేరడానికి అంగీకరించని పక్షంలో రాజధానిలోని గాంధీ ఆసుపత్రికి తరలించాలని కోరుతున్నారు. అన్ని ఆసుపత్రులలోని వైద్యులు కూడా స్వైన్‌ ఫ్లూ పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా అన్ని బోధనా కళాశాలలు, జిల్లా, ఏరియా ఆసుపత్రులలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుతున్నారు. అవసరమెనౖన్ని మెడికల్‌ కిట్లు ప్రైవేటు ఆసుపత్రులలో కూడా పంపిణీ చేశారు. అలాగే, వ్యాధి నిర్ధారణకు సంబంధించి అన్ని పరీక్షలను ఉచితంగానే నిర్వహిస్తున్నట్లు తెలిపారు.