షూటింగులో గాయపడిన హీరోయిన్..

SMTV Desk 2019-01-23 18:57:22  hansika, maha movie, tamil movie, movie news

హైదరాబాద్, జనవరి 23: కథానాయికగా హన్సికకి తెలుగు .. తమిళ భాషల్లో మంచి క్రేజ్ వుంది. తమిళనాడులో అయితే ఆమెకి ఏకంగా గుడి కూడా కట్టారు. అయితే ఆమెకి ప్రస్తుతం తెలుగు కన్నా తమిళంలో ఎక్కువ అవకాశాలు వస్తుండటంతో అక్కడే వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అప్పుడప్పుడు తెలుగు తెరపై కూడా మెరుస్తూనే వచ్చింది. అలా 49 సినిమాలు పూర్తి చేసిన హన్సిక 50వ సినిమాగా మహా అనే తమిళ చిత్రం చేస్తోంది.

ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు జమీల్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పూర్తిగా థ్రిల్లర్ నేపథ్యంలో సాగుతుంది. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తూ ఉండగా, హన్సిక జారిపడిపోవడంతో ఆమె చేతికి పెద్ద గాయమైందట. అయినా హన్సిక ఆ గాయాన్ని లెక్క చేయకుండా షూటింగులో పాల్గొందట. ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగులోను విడుదల చేయనున్నారు.