స్క్రోల్లింగ్ చూసి స్పందించడం నాయకుడి లక్షణం కాదు....

SMTV Desk 2019-01-23 18:27:57  TG Venkatesh, MP, Janasena party, Pawan kalyan

అమరావతి, జనవరి 23: టీడీపీ పార్టీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ రేంజ్ లో స్పందించారో తెలిసిందే. అయితే దానికి మళ్ళీ టీజీ వెంకటేష్ ప్రతిస్పందించాడు. లీడర్లకు ఆవేశం పనికిరాదంటూ పవన్ కి హితవు పలికారు. కార్యకర్తలకు, ప్రజలకు ఆవేశం ఉండొచ్చు కానీ లీడర్లకు ఆవేశం ఉండరాదన్నారు. పార్టీ అధినేతలకు ఆవేశం ఉంటే దెబ్బతింటారని వారితోపాటు వారిని నమ్ముకున్న ప్రజలు కూడా దెబ్బతింటారన్నారు. తాను మాట్లాడిన మాటలను పవన్ తప్పుగా అర్థం చేసుకున్నారని విమర్శించారు. స్క్రోలింగ్ చూసి స్పందించడం అది నాయకుడి లక్షణం కాదని టీజీ వెంకటేష్ స్పష్టం చేశారు.

తనను పెద్ద మనిషి అంటూ మాట్లాడిన పవన్ కళ్యాణ్ కు తాను వొక్కటే చెప్పబోతున్నానని పవన్ ఇంకా ఎదగాలని తాను కోరుకుంటున్నానని కానీ ఇలా వ్యాఖ్యానించడం సరికాదన్నారు. పవన్ కళ్యాణ్ ఇంకా చూడాల్సింది ఎంతో ఉందని కానీ ఆవేశంతో కాకుండా ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు. పవన్ యువకుడు అని అతనికి బోలెడంత వయసు ఉందని ఎంతో ఎత్తుకు ఎదగాలని కానీ ఇలాంటి అర్థంపర్థం లేని వ్యాఖ్యలు చేస్తే ఇబ్బంది పడక తప్పదన్నారు. వొక్కసారి తాను మాట్లాడింది పవన్ కళ్యాణ్ వినాలని తాను మాట్లాడిన విషయంలో ఎక్కడా పవన్ ని అగౌరవ పరచలేదని స్పష్టం చేశారు.