హైదరాబాద్ లో ఘోర అగ్ని ప్రమాదం

SMTV Desk 2019-01-23 17:04:27  Hyderabad, Bhasheerbhag, Khan latheef khan building, Fire accidents

హైదరాబాద్, జనవరి 23: హైదరాబాద్ లోని బషీర్‌బాగ్‌లోని ఖాన్‌లతీఫ్‌ఖాన్ భవనంలో కొద్ది గంటల క్రితం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఆ భవనంలోని ఐదవ అంతస్తులో భారీగా మంటలు చెలరేగాయి. అనంతరం సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. భవనంలోని ఉద్యోగులు, సిబ్బందిని పోలీసులు సురక్షితంగా బయటకు పంపించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.