'ఇస్మార్ట్ శంకర్' లో హీరోయిన్ గా ఆమె..

SMTV Desk 2019-01-23 17:01:20  puri jagannath, ram, charmi, ismart sankar, Anu emmanuel

హైదరాబాద్, జనవరి 23: రామ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ సినిమా ఈ రోజునే పూజ కార్యక్రమాలు జరుపుకుంది. ఈ చిత్ర టైటిల్ .. రామ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ సినిమాలో రామ్ తన కెరియర్ లో వొక డిఫరెంట్ రోల్ చేస్తున్నాడనే విషయం తెలుస్తుంది. రేపటి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమా ద్వారా కొత్త కథానాయిక పరిచయమవుతుందనే టాక్ వినిపించింది. కానీ తాజాగా అనూ ఇమ్మాన్యుయేల్ పేరు తెరపైకి వచ్చింది.

అయితే పూరి అనూ ఇమ్మాన్యుయేల్ ను తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చాడనే టాక్ వినిపిస్తోంది. ఈ మధ్య కాలంలో అనూ కి సరైన హిట్ పడలేదు. అజ్ఞాతవాసి .. నా పేరు సూర్య .. శైలజా రెడ్డి అల్లుడు ఆమెకి నిరాశనే మిగిల్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకి ఈ ఛాన్స్ రావడం విశేషమే. తొలిసారిగా రామ్ జోడీ కడుతోన్న ఆమెకి, ఈ సినిమాతోనైనా హిట్ వస్తుందో లేదో చూడాలి.