మూడో మ్యాచ్ లోను టైటాన్స్ ఓటమి

SMTV Desk 2017-07-31 11:44:17  Telugu Taitans, Defeat, On, Pro Kabaddi

హైదరాబాద్, జూలై 31 : ఆరంభ మ్యాచ్ లో తెలుగు టైటాన్స్, తమిళ తలైవాస్ పై అద్భుతంగా ఆడి మంచి విజయాన్ని అందుకుంది. కాని తరువాత రెండో మ్యాచ్ పాట్నా పై చేజేతులారా ఓటమి పాలైంది. మూడో మ్యాచ్ ఆదివారం గచ్చిబౌలి స్టేడియం లో, బెంగుళూరు బుల్స్ తో జరిగిన మ్యాచ్ లో టైటాన్స్ మళ్ళీ కుప్పకూలింది. ఈ మ్యాచ్ లో టైటాన్స్ 21 పాయింట్లు చేయగా, బెంగుళూరు 31 పాయింట్లు చేసి టైటాన్స్ ను చిత్తుగా ఓడించింది. టైటాన్స్ ఆటగాళ్ళలో ఎవరు మెప్పించ లేకపోయారు. రాహుల్ చౌదరి 14 సార్లు రైడ్ కు వెళ్ళితే, కేవలం 4 పాయింట్లు మాత్రమే తీసుకువచ్చారు. ఆ తరువాత పెద్దగా ఎవరు రాణించక పోవడంతో తెలుగు టైటాన్స్ ఓటమి మూటగట్టుకుంది.