పాప్ సింగర్ అరెస్ట్

SMTV Desk 2019-01-22 21:16:25  Chris brown, Rape case, Police arrest

అమెరికా, జనవరి 22: ప్రముఖ పాప్ సింగర్ రాపర్ క్రిస్ బ్రౌన్ వివాదాల్లో చిక్కుకున్నాడు. తాజాగా ఓ రేప్ కేసులో అతన్ని ఫ్రాన్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జనవరి 15 వ తేదీన ఫ్రాన్స్ కు చెందిన 24 సంవత్సరాల యువతిపై సింగర్ రాపర్ అత్యాచారం చేశారనే ఆరోపణలు రావడంతో పోలీసులు సింగర్ ను అదుపులోకి తీసుకున్నారు. సింగర్ తో పాటు మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.

పాప్ సింగర్ రాపర్ అత్యాచారం విషయాన్న ఫ్రాన్స్ సెలబ్రిటీ మ్యాగజైన్ క్లోజర్ బయటపెట్టింది. ఈ మ్యాగజైన్ కథనం ప్రకారం, చాంప్స్ ఎలీసీస్ నైట్ క్లిబ్ లో బాధిత యువతిని కలిసారని, ఆమెను తరువాత బలవంతంగా హోటల్ కు తీసుకెళ్లి అత్యాచారం చేశారని ప్రచురించింది. పాప్ సింగర్ రాపర్ గతంలో అనేక నేరాలకు పాల్పడినట్టు లే ఫిగేరో పత్రిక పేర్కొన్నది.