'మహర్షి' రిలీజ్ డేట్..

SMTV Desk 2019-01-22 19:20:19  Mahesh babu, Maharshi, release date

హైదరాబాద్, జనవరి 22: ప్రిన్స్ మహేశ్ బాబు 25వ సినిమాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి తెరకెక్కుతుంది. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో మహేశ్ బాబు పూర్తి డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాను ముందుగా ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. కానీ తరువాత ఈ సినిమా ఆ రోజున థియేటర్స్ కి రాకపోవచ్చనే టాక్ వినిపించింది. దాంతో ఈ సినిమా ఎప్పుడు విడుదల కానుందా అనే విషయంలో స్పష్టత కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

తాజాగా మహర్షి సినిమా రిలీజ్ పై క్లారిటీ దిల్ రాజు నుంచి వచ్చేసింది. ఎఫ్ 2 సినిమా హిట్ కొట్టిన సందర్భంగా శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చిన దిల్ రాజు, మహర్షి సినిమాను గురించి అక్కడి మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 25వ తేదీన మహర్షి సినిమాను విడుదల చేయనున్నట్టుగా ఆయన స్పష్టం చేసారు. మరో మూడు నాలుగు ప్రాజెక్టులు షూటింగుకి వెళుతున్నాయని అన్నారు.