నాతో ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు ...

SMTV Desk 2019-01-22 17:25:10  kangana ranaut, manikarnika, meetoo, harassment

హైదరాబాద్, జనవరి 22: కంగనా రనౌత్ నటించిన మణికర్ణిక సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తతం ఆమె చిత్ర ప్రమోషన్ లో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రచార కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ... మీటూ ప్రభావంతో చిత్ర పరిశ్రమలో చాలా మార్పు వచ్చిందని అన్నారు. మహిళా నటులతో పిచ్చి వేషాలు వేసేవారు... ఇప్పుడు అలా ప్రవర్తించడానికి భయపడుతున్నారని అన్నారు. గతంలో తన పట్ల ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన గురించి కంగనా వెల్లడించింది.

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. గతంలో ఓ కార్యక్రమంలో అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి అసభ్యంగా తనను గిల్లాడని... ఇప్పుడేం చేస్తావ్? అన్నట్టుగా చూశాడని... అతను చూపు తనకు చాలా చిరాకు తెప్పించిందన్నారు. ఆడపిల్లలు తమ భద్రత విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. రక్షణ కోసం ఆడపిల్లలు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని గతంలో రాణీ ముఖర్జీ చెప్పింది కరెక్ట్ అని అన్నారు.