న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ త్వరలోనే ప్రారంభం ..

SMTV Desk 2019-01-22 15:54:07  Telanganastate,New MLA Quarters,Pocharam Srinivas reddy,Telangana government

హైదరాబాద్, జనవరి 22: తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యులకు సంబంధించిన నూతన క్వార్టర్స్‌ను త్వరలోనే ప్రారంభిస్తామని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వివిధ పార్టీల నుంచి 119 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. మరో శాసనసభ్యుడు నామినేట్ అయ్యారు. మొత్తం 120 మంది ఎమ్మెల్యేలకు అధునాతన సౌకర్యాలతో కూడిన ఇండ్లని నిర్మించారు. 4.5 ఎకరాల్లో నిర్మించిన ఇండ్ల సముదాయాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. కమిటీ వేసుకొని నియమ నిబంధనల మేరకే ఇండ్లు కేటాయిస్తామన్నారు. వొక్కో ఫ్లాట్ 2,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించడం జరిగిందన్నారు. వొకేసారి 200 వాహనాలను నిలిపే విధంగా 3 సెల్లార్లను నిర్మించడం జరిగిందన్నారు. ఈ ఇండ్ల నిర్మాణం రూ. 166 కోట్లతో జరిగిందని పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.