విచారణకు హాజరైన తనీష్

SMTV Desk 2017-07-31 10:56:56  drugs case, tanish, sit, oficitions, enqary

హైదరాబాద్, జూలై 31 : డ్రగ్స్ కేసు విచారణ లో భాగంగా ఈ రోజు హీరో తనీష్ ను సిట్ అధికారులు విచారించనున్నారు. నాంపల్లి లో సిట్ కార్యాలయానికి హీరో తనీష్ ఉదయం 10.30 గంటలకు చేరుకున్నారు. ఈ విచారణలో అధికారులు తనీష్ ను “డ్రగ్స్ ఎప్పటి నుంచి వాడుతున్నారు.? కెల్విన్, జీషాన్ లు ఎప్పటి నుంచి తెలుసు? వాళ్ళ దగ్గర ఎన్ని సార్లు డ్రగ్స్ కొన్నారు.? డ్రగ్స్ కొనుగోలు చేసి ఎవరికైనా అమ్మకాలు కూడా చేసేవారా? సినిమా ఇండస్ట్రీ లో ఎవరి తో ఎక్కువ గా పరిచయం ఉంది ? వాళ్లతో కలిసి డ్రగ్స్ వాడేవారా? పబ్బులకు వెళ్తారా? ఇలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉందని తెలుస్తుంది.