ఓటర్ లిస్ట్ లో మళ్ళి ప్రత్యక్షం ??

SMTV Desk 2019-01-22 12:52:39  Telangana election commission, Voter list, Enrollment, CEO Rajath kumar, Assembly elections

​హైదరాబాద్, జనవరి 22: తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో ఓటర్ల జాబితాలో కనిపించని పేర్లు ఇప్పుడు తిరిగి ​కనిపించడం తో షాక్ కి గురయ్యారు. శానససభ ఎన్నికల్లో ఓటు వేయడానికి వేయడానికి వెళ్లినప్పుడు 15 మంది పేర్లు మాయమయ్యాయి. వారు ఆదివారంనాడు స్పెషల్ ఎన్ రోల్ మెంట్ డ్రైవ్ లో భాగంగా ఓట్లు నమోదు చేయించుకోవడానికి వెళ్లారు. ఆ సమయంలో వారికి తమ పేర్లు కనిపించాయి. ఇప్పుడు వారి పేర్లు ఓటర్ల జాబితాలో కనిపించడం అసాధ్యమని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ డాక్టర్ రజత్ కుమార్ అన్నారు. ఎన్ రోల్ మెంట్ డ్రైవ్ సందర్భంగా వారి పేర్లు కనిపించాయని చెప్పినట్లు ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక రాసింది.
GHMC పరిధిలోని సైనిక్ పురి, యాప్రాల్, ఆల్వాల్, కాప్రా, సాకేత్ ప్రాంతాలకు చెందినవారు శాసనసభ ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళ్లినప్పుడు ఓటర్ల జాబితాలో వారి వారి పేర్లు కనిపించలేదు. పోలింగ్ కు ముందు ఓటర్ల జాబితాలో తమ పేర్లు కనిపించాయని, ఓటు వేయడానికి వెళ్లినప్పుడు మాత్రం కనిపించలేదని వారంటున్నట్లు ఆ పత్రిక రాసింది.