వైరల్ అవుతున్న విజయ్ చిన్నప్పటి వీడియో..

SMTV Desk 2019-01-22 12:12:21  Vijay Devarakonda, Dear Comrade, childhood video, vijay fan

హైదరాబాద్, జనవరి 22: అర్జున్ రెడ్డి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకొని గీత గోవిందం చిత్రంతో స్టార్ హీరోగా మారిన విజయ్ దేవరకొండ చిన్నప్పటి వీడియో వొకటి ఇప్పుడు నెట్ లో హలచల్ చేస్తుంది. ఈ వీడియోలో విజయ్ బొద్దుగా గుండ్రటి ముఖంతో ముద్దులొలికేలా ఉన్నాడు. ఇంకా ఈ వీడియోలో వొకప్పటి నటి షావుకారు జానకి కూడా ఉన్నారు. విజయ్ చిన్నప్పటి వీడియో ఇప్పుడు బయటకు వచ్చి సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.

అయితే ఈ వీడియో 1999 సంవత్సరంలో షావుకారు జానకితో కలిసి విజయ్ ఓ టీవీ సీరియల్ లో నటించినప్పటిది. దాన్ని ఇప్పుడు విజయ్ అభిమాని వొకరు సంపాదించి తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసి విజయ్‌ దేవరకొండను ట్యాగ్ చేసాడు. దీన్ని చూసిన విజయ్, వీడియోను పోస్టు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపాడు. ప్రస్తుతం విజయ్ డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్నాడు.