​​ శింబు 'అత్తారింటికి దారేది' రిలీజ్ డేట్ ఫిక్స్ ??

SMTV Desk 2019-01-22 11:14:12  Attarintikidaredi,Shimbu,Tamil movie,vantha rajavathaan varuven,Catherin,Megha Akash,Sundar,Powerstar

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా వచ్చిన 'అత్తారింటికి దారేది' చిత్రం ఎలాంటి విజయాన్ని నమోదు చేసిందో మనకి తెలిసిందే. పవన్ కల్యాణ్ కెరియర్లో ఈ సినిమా ఎంత పెద్ద హిట్ గ చెప్పుకోదగినదో తెలిసిందే. అలాంటి ఈ సినిమాను తమిళంలో శింబు కథానాయకుడిగా 'వంత రాజవతాన్ వరువేన్' పేరుతో రీమేక్ చేస్తున్నారు. సుందర్ .సి దర్శకత్వంలో ఈ సినిమా నిర్మితమవుతుంది. మేఘ ఆకాశ్ .. కేథరిన్ త్రేసా కథానాయికలుగా నటించిన ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేసారు కానీ కుదరలేదు. దాంతో ఫిబ్రవరి 1వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చేశారు. లైకా ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా, శింబుకి భారీ విజయాన్ని కట్టబెట్టడం ఖాయమనే నమ్మకంతో అభిమానులు వున్నారు. తెలుగులో లాగానే రికార్డులు తమిళంలో కూడా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి ...