ఏప్రిల్ చివరివారంలో రానున్న మహర్షి ..

SMTV Desk 2019-01-21 19:58:10  Mahesh babu, Maharshi, abudhabi, april release

హైదరాబాద్, జనవరి 21: సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం ప్రస్తుతం పొల్లాచ్చి లో షూటింగ్ జరుపుకుంటోంది. మహేశ్ బాబు .. తదితరులపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ వారం చివరివరకూ అక్కడే చిత్రీకరణ జరగనుంది. ఆ తరువాత షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను ఇక్కడ ప్లాన్ చేశారు.

తదుపరి షెడ్యూల్ ను అబుదాబీలో చేయనున్నారు. ఈ షెడ్యూల్ తో షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది. మిగతా పనులన్నీ పూర్తి చేసుకుని, ఏప్రిల్ చివరివారంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మహేశ్ ప్రాణ స్నేహితుడిగా అల్లరి నరేశ్ కనిపించగా, కథానాయికగా పూజా హెగ్డే నటిస్తుంది.