మళ్ళీ తెదేపా సర్కార్ రాకపోతే రాజకీయ సన్యాసమే....

SMTV Desk 2019-01-21 19:30:13  Tenali constituency MLA Alapati rajendraprasad, TDP, Andhrapradesh assembly elections

గుంటూర్, జనవరి 21: రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా ప్రభుత్వం అధికారంలోకి రాకపోతే శాశ్వతంగా రాజకీయాల్లోనుండి తప్పుకుంటాను అని సంచలన ప్రకటన చేశారు తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్. ఈ రోజు ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజకీయ నాయకుడిగా కాకుండా దిగజారుడుగా మాట్లాడారని ఆయన మండిపడ్డారు. నీతి నిజాయితీలు లేని వ్యక్తులు రాజకీయాలకు పనికిరారని రాజేంద్రప్రసాద్ అభిప్రాయపడ్డారు.

తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడే విధానం మార్చుకోవాలని కోరారు. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ఛాలెంజ్ చేస్తున్నవారికి తాను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నట్టు ఆలపాటి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ అధికారంలోకి రాకపోతే తాను రాజకీయాల నుండి తప్పుకొంటానని ఆయన ప్రకటించారు.