చైనాని కుదిపేస్తున్న ట్రంప్ దెబ్బ..

SMTV Desk 2019-01-21 19:28:18  USA, Chaina, Donald Trump

బీజింగ్‌, జనవరి 21: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ తెరతీసిన వాణిజ్య యుద్ధం దెబ్బ చైనాకు బలంగా తగిలింది. దాని ఫలితంగా చైనా గత సంవత్సర వృద్ధిరేటు 6.6 శాతానికి చేరింది. చాలా సంవత్సరాల తర్వాత చైనా నమోదు చేసిన అతి కనిష్ట వృద్ధి రేటు ఇదే. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి చైనా 6.4శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. గత త్రైమాసికంలో నమోదు చేసిన 6.5శాతం వృద్ధి రేటు కంటే ఇది తక్కువ.

కొని సంవత్సరాలుగా చైనా వృద్ధి రేటులో తగ్గుదల కనిపిస్తుంది, కానీ అది ఇటీవల కాలంలో వేగవంతమైంది. చైనాలో వృద్ధి రేటు మందగమనం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో చైనా కూడా ఎగుమతులపై ఆధారపడకుండా దిగుమతులను పెంచుకొనేదిశగా ప్రయత్నాలను ప్రారంభించింది. దీనిలో భాగంగా దేశీయ విక్రయాలు పెరిగేలా చర్యలు తీసుకొంటోంది. నిర్మాణ రంగ ప్రాజెక్టులను వేగవంతం చేయడం, పన్ను మినహాయిపులను పెంచడం, ఆ దేశ రిజర్వుబ్యాంకు‌ నిల్వలను తగ్గించడం వంటి చర్యలు చేపట్టింది.