మహిళ దారుణ హత్య

SMTV Desk 2017-07-31 10:39:32  women, killing,

నల్గొండ, జూలై 31 : నల్గొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా చండూరు మండలం ఇడికూడలో మహిళ హత్యకు గురైంది. వివరాల్లోకి వెళ్తే.... చండూరు మండలంలోని ఇడికూడు వద్ద ఓ మహిళా ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో కొందరు గుర్తు తెలియని దుండగులు ఆమెను అతి క్రురంగా చంపారు. తరువాత గుట్టు చప్పుడు కాకుండా చెరువులో పడేశారని తెలుస్తుంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభిస్తున్నామని తెలిపారు.