పంచాయతి ఎన్నికల ఫలితాల్లోనూ కారుదే జోరు

SMTV Desk 2019-01-21 17:49:54  Telangana panchayat elections, Election commission, Sarpanch, Ward members, Election results, TRS

హైదరాబాద్, జనవరి 21: రాష్ట్ర గ్రామ పంచాయతి ఎన్నికల్లో మరోసారి తెరాస తన సత్తా చాటుకుంటుంది. ఎన్నికల ఫలితాల్లో టీఆరెస్ ప్రభంజనం కొనసాగుతోంది. తొలివిడతలో 3,701 గ్రామపంచాయితీలకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికల బరిలో 12,202 మంది సర్పంచ్‌ అభ్యర్ధులు నిలబడ్డారు.

మధ్యాహ్నం 2 గంటల నుంచి అధికారులు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. ఎన్నికల ఫలితాల్లో టిఆర్‌ఎస్‌ మద్దతుదారులు దూసుకుపోతున్నారు. ఇప్పటి వరకు అందిన ఫలితాలోల టిఆర్‌ఎస్‌ 620, కాంగ్రెస్‌ 37, టిడిపి 2, బిజెపి 2, సిపిఐ 2, సిపిఎం 6, ఇతరులు 111 స్థానాల్లో గెలుపొందారు.