మాయావతిపై నీచమైన వ్యాఖ్యలు చేసిన భాజపా నేత..

SMTV Desk 2019-01-21 13:13:16  BSP chief Mayawati, BJP mla, Sadhana singh, contraversiol coments, National Women Commission, notices issue

ఉత్తర్ ప్రదేశ్, జనవరి 21: ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతిపై బీజేపీ ఎమ్మెల్యే సాధనా సింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ బహిరంగ సభలో సాధనా సింగ్‌ ఎస్పీ–బీఎస్పీ పొత్తుపై మాట్లాడుతూ..‘అధికారం కోసం గౌరవాన్ని వదులుకున్న మాయావతి తనపై దాడిచేసిన వారితోనే చేతులు కలిపారు. ఆమె ఆడజాతికే కళంకం లాంటిది. అసలు మాయావతి ఆడో, మగో చెప్పలేం. ఆమె హిజ్రా కంటే అధ్వానమైన వ్యక్తి అని దుర్భాషలాడారు. దాంతో ఆమె చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని విచారణను స్వీకరిస్తున్నట్లు జాతీయ మహిళా కమిషన్‌ చైర్మన్‌ రేఖ శర్మ తెలిపారు.

ఈ నేపథ్యంలో సాధనా సింగ్‌ కి సోమవారం నోటీసులు జారీచేస్తామన్నారు. మరోవైపు సాధనా వ్యాఖ్యలను ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్, కేంద్ర మంత్రి రామ్‌దాస్‌ అథావలే, బీఎస్పీ నేత ఎస్సీ మిశ్రా, కాంగ్రెస్‌ నేత ప్రియాంకా చతుర్వేది ఖండించారు. కాగా, 1995లో లక్నోలోని ఓ గెస్ట్‌హౌస్‌లో బీఎస్పీ నేతలతో సమావేశమైన మాయావతిపై ఎస్పీ కార్యకర్తలు దాడి చేశారు.