'దండుపాళ్యం'కు షాక్....

SMTV Desk 2019-01-21 13:00:47  Dandupalyam 4, Censor board,Censor board certificate

బెంగుళూరు, జనవరి 21: 'దండుపాళ్యం' ఈ సినిమా తెలుగులో ఏ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకుందే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ సినిమా నుండి మూడు పార్టులు విడుదలయ్యి మంచి ఆదరణ పొందింది. తాజాగా నాలుగో పార్టు కూడా విడుదలకు సిద్దం అనే సమయంలో సెన్సార్ బోర్డు దండుపాళ్యం టీం కు ఊహించని షాక్ ఇచ్చింది. బెంగుళూరుకి దగ్గరలో దండుపాళ్యకి చెందిన దోపిడీ దొంగల కథ ఆధారంగా 'దండుపాళ్యం' సినిమాను కొన్ని పార్టులుగా చిత్రీకరిస్తున్నారు. నాలోగో పార్టు షూటింగ్ పూర్తి చేసుకొని ఈ మధ్యే సెన్సార్ బోర్డు వద్దకు వెళ్ళింది. అయితే ఈ సినిమాకి రాష్ట్ర సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇవ్వడం కుదరదంటూ సెన్సార్ సభ్యులు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. సినిమాలో చాలా సన్నివేశాలు హింసతో కూడుకొని అసభ్యకరంగా ఉన్నాయని, ఇలాంటి సినిమాలు ప్రజలు చూడడం కష్టమని స్పష్టం చేసింది సెన్సార్ టీమ్.

దీంతో నిర్మాత వెంకటేష్ కర్నాటక చలన చిత్ర వాణిజ్య మండలి, కేంద్ర సెన్సార్ బోర్డ్ కి ఫిర్యాదు చేశారు. దీంతో పరిస్థితులు వివాదాస్పదంగా మారాయి. సెన్సార్ సభ్యులు కావాలనే ఎలాంటి కారణాలు లేకుండా తమ సినిమాను నిరాకరించారని నిర్మాత వెంకటేష్ ఆరోపిస్తున్నారు. సినిమాలో అభ్యంతకర సన్నివేశాలు ఉంటే వాటిని తొలగించమని చెప్పాలి.. లేదంటే రీషూటింగ్ చేయమని సూచించాలే తప్ప.. అలా చేయకుండా సెన్సార్ బోర్డ్ తమను వేధిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో కోట్లు ఖర్చు చేసి సినిమా తీసి ఐదు భాషలలో విడుదల చేయాలని నిర్ణయిస్తే.. అంతలోనే ఇలా జరిగిందని వాపోయారు. మరి ఈ వివాదం ఎప్పుడు సద్దుమణుగుతుందో చూడాలి!