నేటి నుండి పంచాయతి ఎన్నికలు....

SMTV Desk 2019-01-21 11:51:02  Telangana state panchayat elections, Poling starts, Election commission

హైదరాబాద్, జనవరి 21: రాష్ట్రంలో తొలి విడత పంచాయతి ఎన్నికలు మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4479 పంచాయతీలకు గాను ఈ విడతలో 769 పంచాయతీలు, 28,976 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. బరిలో 70, 094 మంది అభ్యర్థులు ఉన్నారు. తొలి విడత ఎన్నికల్లో 10, 654 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. కాగా ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నాం వొంటిగంట వరకు పోలింగ్ జరగనుంది.

ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో సుమారు 26 వేలమంది పోలీసులతో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. మధ్యాహ్నాం 2 తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభించి, సాయంత్రానిక ఫలితాలను ప్రకటించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. కాగా, తొలి విడతలో 769 సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని కార్యాలయం నుంచి ఎన్నికల సంఘం పోలింగ్ సరళిని పర్యవేక్షించనుంది.