ఒంటరిగా మిగిలిన 'యాత్ర'...!

SMTV Desk 2019-01-20 16:06:27  Yatra Movie, NTR Kathanayakudu, NTR Mahanayakudu, NTR, YS Rajashekhar reddy

హైదరాబాద్, జనవరి 20: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితాధారంగా తెరకెక్కుతున్న చిత్రం యాత్ర . అలాగే సంచలన నటుడు, తెదేపా అధినేత, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితాధారంగా తెరక్కెక్కిన చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు . ఈ రెండు సినిమాలు ఏపీలో ఎన్నికల సందర్భంగా విడుదల చేయాలని సన్నాహాలు చేశారు. అయితే ఇప్పటికే ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. అందులోని మరో భాగం ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాని తొందర్లో విడుదల చేయడానికి సినీ బృందం చూస్తుంది.

ఈ సినిమాకి పోటీగా వైఎస్సార్ బయోపిక్ యాత్ర ని రంగంలోకి దించాలని ప్లాన్ చేశారు. మొదటినుండి కూడా యాత్ర సినిమా ఎన్టీఆర్ బయోపిక్ కి పోటీగా వచ్చేలా పావులు కదిపారు. ఆ విధంగా యాత్ర పై బజ్ క్రియేట్ అవుతుందని భావించారు. ఎన్టీఆర్, వైఎస్సార్ సినిమాల మధ్య మంచి పోటీ ఉంటుందని ఊహించారు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాని వాయిదా వేయడంతో ఫిబ్రవరి 8న యాత్రం వొంటరిగానే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటివరకు ఈ సినిమాపై ఎలాంటి హైప్ క్రియేట్ చేయలేకపోయింది చిత్రబృందం. టీజర్, ట్రైలర్ లకు పెద్దగా క్రేజ్ రాలేదు. సినిమా పోస్టర్లు కూడా రొటీన్ గానే ఉండడంతో ఈ సినిమాపై ఎవరి దృష్టి పడడం లేదు. వొక మీడియా సంస్థ స్పెషల్ గా ఈ సినిమాను ప్రమోట్ చేస్తుందనుకుంటే అది కూడా లేదు. దీంతో ఈ సినిమాను పట్టించుకునేవారే లేకుండా పోయింది. మరి సినిమాకు ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి!