చిలీ దేశంలో భారీ భూకంపం

SMTV Desk 2019-01-20 14:05:59  Chili country earth quake, Rector scale

చిలి, జనవరి 20: చిలీ దేశంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.7గా నమోదు కాగా భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించినట్లు సమాచారం అందలేదు. చిలీలోని కోక్యూంబోకు 15.6 కిలోమీటర్ల దూరంలో 56 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

సునామీ సృష్టించే అవకాశాలు లేవని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ముందు జాగ్రత్తగా తీరంలోని ప్రజలను ఇళ్లు ఖాళీ చేయాల్సిందిగా ఆదేశించినప్పటికి ఆ తర్వాత ఉత్తర్వులను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.