శృంగార తారగా రమ్యకృష్ణ..

SMTV Desk 2019-01-19 19:53:49  ramyakrishna, cijay sethupathi, samantha, ramyakrishna playing to porn star role

హైదరాబాద్, జనవరి 19: వొకప్పటి హీరోయిన్ రమ్యకృష్ణ ప్రస్తతం పలు పాత్రలలో అలరిస్తుంది. బాహుబలిలో రమ్యకృష్ణ చేసిన శివగామి పాత్రకి ఆమె వల్లే అంత పేరు వచ్చింది అనడంలో ఆశ్చర్యమేలేదు. ఇప్పటివరకు ఆమె ఎన్నో పత్రాలు చేసింది ... ప్రేమికురాలిగా, గృహిణిగా, చలాకీ అమ్మాయి వంటి పాత్రల నుంచి శివగామి పాత్ర వరకు తన అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రల్లో బిజీగా ఉన్న రమ్యకృష్ణ తాజాగా ఓ ఆసక్తికర పాత్రలో నటించేందుకు సాహసించింది. ఓ తమిళ సినిమాలో శృంగార తార పాత్రలో ఆమె కనిపించనుంది. తమిళ హీరో విజయ్ సేతుపతి, అక్కినేని సమంత జంటగా నటిస్తున్న సినిమా ‘సూపర్ డీలక్స్ . త్యాగరాజన్ కుమారరాజ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ పోర్న్ స్టార్ పాత్రలో కనిపించనుంది.

ఈ చిత్రంలో ‘లీల అనే శృంగార తార పాత్రలో రమ్యకృష్ణ కనిపించనున్నట్టు చిత్ర దర్శకనిర్మాతలు వెల్లడించారు. ఈ పాత్రలో నటించేందుకు తొలుత నదియాను సంప్రదించగా, అందుకు ఆమె తిరస్కరించడంతో రమ్యకృష్ణను తీసుకున్నట్టు చెప్పారు. కాగా, ఈ సినిమాలో పలు ప్రత్యేకతలు ఉన్నాయని వారు వెల్లడించారు. ఈ చిత్రంలో హీరో విజయ్ సేతుపతి లేడీ గెటప్ లో కనిపించనున్నారు. సమంత కూడా రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనుంది.