కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కేసీఆర్ కీలక నిర్ణయం

SMTV Desk 2019-01-19 19:45:07  Klaeshwaram project, KCR, TRS, Telanagana state Chief minister, Muthol constituency MLA Vittal reddy

హైదరాబాద్, జనవరి 19: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వాసితులకు తక్షణమే నష్టపరిహారం విడుదల చెయ్యాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ముధోల్ నియోజకవర్గం పరిధిలో ఇబ్బందులు పడుతున్న నిర్వాసితులకు తొలుత నష్టపరిహారం అందజెయ్యాలని ఆదేశించారు.

ఇటీవలే ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సీఎం కేసీఆర్ ను కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వాసితులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే విజ్ఞపై స్పందించిన సీఎం కేసీఆర్ తక్షణమే నష్టపరిహారం విడుదల చెయ్యాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో అధికారులు ముంపు నిర్వాసితులను లెక్కగట్టే పనిలో పడ్డారు. అటు కేసీఆర్ నిర్ణయంపై ఎమ్మెల్యే విఠల్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.