పాకిస్తాన్ ప్రధానిగా షహీద్ అబ్బాసీ...

SMTV Desk 2017-07-30 17:25:27  Pakistan PM, Shahid Khakan abbasi, Pakistan Emergency PM,Pakistan Temporary PM

పాకిస్తాన్, జూలై 30: ఇటీవల పనామా పేపర్ల అవినీతి కేసులో దోషిగా తేలిన కారణంగా పాకిస్తాన్ ప్రధాని పదవి నుంచి వైదొలిగిన నవాజ్ షరీఫ్ వారసుడుగా ఆయన సోదరుడు షెహబాజ్‌ను ఎంపిక చేశారు. అయితే ఆయన పార్లమెంట్‌ సభ్యునిగా ఎన్నిక కావలసివుంది అంతవరకు పెట్రోలియం శాఖ మాజీ మంత్రి షహీద్ ఖాకన్ ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. శనివారం పిఎంఎల్ పార్టీ సమావేశానంతరం షరీఫ్ ఈ వివరాలు తెలిపారు. పనామా పేపర్ల కేసులో షరీఫ్‌పై ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం విధించిన అనర్హత వేటు ఎంతకాలం అనే దానిపై తీర్పులో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపధ్యంలో ఆయన జీవితకాలం రాజకీయాలకు దూరం కావాలా అనే అనుమానం అందరిలో రెకెత్తుతుంది. గతంలో మాజీ ప్రధాని యూసుఫ్ గిలానీపై సుప్రీంకోర్టు 5ఏళ్ల పాటు అనర్హత వేటు వేసింది అయితే షరీఫ్ కేసులో నిర్దిష్ట కాలాన్ని వెల్లడించక పోవడంతో ఈ తరహా అనుమానాలు వస్తున్నాయి.