రూ.20 లక్షల గంజాయి స్వాధీనం

SMTV Desk 2019-01-19 18:56:58  Ganjaa, Police catch huge amount of drugs, Mahaboobabad, Vehicle checking

కొత్తగూడెం, జనవరి 19: జిల్లా బూర్గంపాడు మండలం ఉప్పుసాక నుండి మహబూబాబాద్ కు వెళ్తున్న వాహనాల తనిఖీలో భారీగా తరలిస్తున్న గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మహబూబాబాద్ కు గంజాయిని తరలిస్తుండగా రూ.20 లక్షలు విలువ చేసే గంజాయి పోలీసులు పట్టుకున్నారు.

అంతేకాక ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వాహనాలను సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.