రమ్యకృష్ణ అలాంటి క్యారెక్టర్ చేయబోతుందా?

SMTV Desk 2019-01-19 18:12:30  Ramya Krishna, super deluxe, porn star

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఏంటి పోర్న్ స్టార్ గా మారడం ఏంటని టైటిల్ చూసి కాస్త షాక్ అయ్యే అవకాశం ఉంది. అయితే తన వద్దకు వచ్చే ఎలాంటి ఛాలెజింగ్ రోల్ అయినా సరే కాదని చెప్పని రమ్యకృష్ణ లేటెస్ట్ గా ఓ సినిమా కోసం శృంగార తార అవతారం ఎత్తబోతుందట. ఈ వయసులో అలాంటి పాత్ర చేయడమంటే సాహసమే అని చెప్పాలి కాని రమ్యకృష్ణ అందుకు రెడీ అంటుంది.

ఇక విషయానికొస్తే , 96 ఫేమ్ విజయ్ సేతుపతి, సమంత జంటగా నటిస్తున్న సినిమాలో రమ్యకృష్ణ పోర్న్ స్టార్ గా కనిపిస్తుందట. ఈ సినిమాను త్యాగరాజన్ కుమార రాజా డైరక్షన్ లో వస్తుందని తెలుస్తుంది. సూపర్ డీలక్స్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి కూడా లేడీ గెటప్ లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో లీలా అనే శృంగార తారగా రమ్యకృష్ణ నటిస్తుంది. ముందు ఈ రోల్ కోసం అత్తారింటికి దారేది సినిమాలో అత్తగా చేసిన నదియాను అడిగారట ఆమె చేయనని చెప్పడంతో రమ్యకృష్ణ అందుకు ఓకే అన్నదట. మరి సీనియర్ స్టార్ హీరోయిన్ గా రమ్యకృష్ణ చేస్తున్న ఈ సాహసం ఎలా ఉంటుందో చూడాలి.