లక్ష్మీస్ ఎన్టీఆర్ : ఎన్టీఆర్ పాత్ర పోషించింది ఎవరు?

SMTV Desk 2019-01-19 18:08:51  Ram Gopal Varma, Lakshmi's NTR, ntr first look teaser

హైదరాబాద్, జనవరి 19: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దివంగత ఎన్టీఆర్ జీవిత కధ ఆధారంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా తొలి టీజర్ ను నిన్న విడుదల చేసారు. ఈ టీజర్ ద్వారా చిత్రంలో ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంటుందో వర్మ పరిచయం చేశారు. అయితే, ఎన్టీఆర్ పాత్ర పోషించిన ఆర్టిస్ట్ ఎవరన్న విషయాన్ని ఆర్.జి.వి ఎక్కడ ప్రస్తావించలేదు. దాంతో ఆ పాత్రలో నటించింది ఫలానా ఆర్టిస్ట్ అంటూ ఊహాగానాలు మొదలయ్యాయి.

ఈ ఊహాగానాలను ఖండిస్తూ ఆ పాత్ర పోషించింది ఎవరన్న విషయాన్ని వర్మ స్పష్టం చేశారు. అతను పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన తెలుగు రంగస్థల నటుడని చెప్పారు. ఎన్టీఆర్ లా ప్రసంగించడం, హావభావాలు పలికించడం వంటి విషయాల్లో ఆయనకు శిక్షణ ఇచ్చిన విషయాన్ని తన ట్వీట్ లో పేర్కొన్నారు.