మహర్షిలో ఈ ఫైట్ హైలెట్..

SMTV Desk 2019-01-19 17:41:00  Mahesh babu, pooja hegde, devisri prasad, vamsi paidipalli, Maharshi, tractor fight

హైదరాబాద్, జనవరి 19: ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలోలో మహేశ్ ధనికుడిగానే కాకుండా .. ఓ మాములు రైతుగా కూడా కనిపించనున్నాడు. పల్లెటూరు నేపథ్యంలో వచ్చే కొన్ని సీన్స్ ని ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన విలేజ్ సెట్లో చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ సినిమా పొల్లాచ్చిలో షూటింగ్ జరుపుకుంటోంది. మహేశ్ పొలంలో ట్రాక్టర్ తో దున్నుతూ వుండే సన్నివేశంతో పాటు, 60 ట్రాక్టర్లతో అక్కడ వొక భారీ ఫైట్ సీన్ ను ప్లాన్ చేశారట.

ఇక అక్కడ తెరకెక్కించే సన్నివేశాలు చిత్ర హైలైట్స్ గా నిలుస్తాయని అంటున్నారు. తన స్నేహితుడి కోసం ఇండియా వచ్చిన హీరో .. వ్యవసాయంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం కథలో ప్రధానాంశంగా కనిపిస్తుందని చెబుతున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిచారు.