అనసూయతో విజయ్ దేవరకొండ సినిమా..

SMTV Desk 2019-01-19 17:13:51  Vijay Devarakonda, Anasuya, F2 movie, king hills

హైదరాబాద్, జనవరి 19: యాంకర్ అనసూయ రంగస్థలంలో చేసిన రంగమ్మత్త పాత్ర ఆమెకి మంచి పేరు తీసుకొచ్చింది. దాంతో అనసూయకి సినిమా అవకాశాల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. ఇక తనకి నచ్చిన పాత్రలకు ఓకే చెప్తూ ఆమె ముందుకు దూసుకువెళుతుంది. తాజాగా ఎఫ్ 2 సినిమాలో అలరించిన అనసూయ .. త్వరలో వైఎస్. రాజశేఖరరెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న యాత్ర సినిమాతోను పలకరించనుంది. ఈ నేపథ్యంలో ఆమె అర్జున్ రెడ్డితో మంచి పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ సినిమాలోను చేయబోతుందని సమాచారం. విజయ్ వొక వైపున హీరోగా బిజీ అవుతూనే .. మరో వైపున చిత్ర నిర్మాణంపై కూడా దృష్టి పెట్టాడు.

ఈ నేపథ్యంలో తన బ్యానర్ అయిన కింగ్ హిల్స్ పై ఆయన వొక చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. నాలుగు ప్రధాన పాత్రల చుట్టూ తిరిగే భిన్నమైన కథతో ఈ చిత్రం రూపొందుతుంది. ఇప్పటికే వొక పాత్ర కోసం దర్శకుడు తరుణ్ భాస్కర్ ను తీసుకున్నారు. మరో పాత్ర కోసం అనసూయను ఎంపిక చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మరో రెండు పాత్రలకిగాను ఆర్టిస్టుల ఎంపిక జరగవలసి వుంది.