దేశంలో మాదకద్రవ్యాల కలకలం

SMTV Desk 2017-07-30 17:16:09  gujarath, drags, india, Arabian Sea, Rs. 3500 crore, Merchant ship,1500 kg heroin, Intelligence Bureau, Police and Customs Naval Connection

గాంధీనగర్, జూలై 30 : గుజరాత్ తీర ప్రాంతంలో రికార్డు స్థాయిలో మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. అరేబియా సముద్రంలో ఒక వాణిజ్య నౌకనుంచి రూ. 3500 కోట్ల విలువైన 1500 వందల కిలోల హెరాయిన్ ను భారత తీర రక్షణ దళం స్వాధీనం చేసుకుంది. దేశంలో ఇంత భారీ మొత్తంలో మాదకద్రవ్యాలు పట్టుబడటం ఇదే తొలిసారి. గుజరాత్ తీర ప్రాంతంలో దేశ తీర రక్షణికి చెందిన సముద్ర పావక్ అనే నౌక గస్తీలో భాగంగా ఒక వాణిజ్య నౌకలో తనిఖీలు నిర్వహించి భారీ ఎత్తున మాదకద్రవ్యాలు ఉన్నట్లు గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకుంది. ఇంత భారీ మొతంలో డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపగా ఈ వ్యవహారంలో నిగ్గు తేల్చేందుకు దర్యాప్తు సంస్థలని రంగంలోకి దిగాయి. ఈ ఘటనపై తీర రక్షక దళం సహా ఇంటలిజెన్స్ బ్యూరో, పోలీస్, కస్టమ్స్ నౌకదళ సంయుక్తంగా దర్యాప్తు ఆరంభించాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.