యాత్ర : జగన్ పాత్రలో ఈయనే

SMTV Desk 2019-01-19 10:39:01  yatra movie, jagan, mammutti

హైదరాబాద్, జనవరి 19: మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి రాజకీయ జీవితంలో ముఖ్య ఘట్టమైన పాదయాత్ర నేపథ్యంలో రూపొందుతున్న సినిమా ‘యాత్ర . రాజశేఖర్‌రెడ్డి పాత్రని ప్రముఖ మలయాళ హీరో మమ్ముట్టి పోషించారు. మహి.వి.రాఘవ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వైసీపీ అధినేత వై.ఎస్‌.జగన్ ఓ చిన్న పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో తన పాత్రలోనే జగన్ కనిపిస్తారని చిత్ర వర్గాలు తెలిపాయి. విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే నెల 8న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.