కాంగ్రెస్ తో జతకడితే బతికి బట్టకట్టలేవు : కేంద్ర మంత్రి

SMTV Desk 2019-01-18 20:11:13  Central minister, Rajnath singh, BJP, Congress party, NTR Death anniversary

కడప, జనవరి 18: శుక్రవారం కడప జిల్లలో బీజేపీ శక్తి కేంద్ర సమ్మేళన్ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పాల్గొన్నారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ పాలనతో అగ్రరాజ్యాల సరసన భారత్‌ చేరిందని పీవీ సంస్కరణలతో దేశాన్ని మహాశక్తిగా తీర్చిదిద్దితే అదే సంస్కరణలతో బీజేపీ దేశాన్ని అభివృద్ధి చేస్తోందన్నారు.

శాంతిభద్రతలు కాపాడేందుకు మోదీ ప్రభుత్వం సమర్థంగా పనిచేస్తోందని చెప్పారు. కాంగ్రెస్‌తో జతకట్టిన పార్టీలు బతికి బట్టకట్టలేవని విమర్శించారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో ఏ ప్రభుత్వం ఉన్నా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.