బెంగాల్ సీఎం ఇన్విటేషన్ కు కేసీఆర్ వెనుకడుగు

SMTV Desk 2019-01-18 19:50:40  KCR, Mamata benarjee, Bnegal cm, TRS

హైదరాబాద్, జనవరి 18: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫోన్ చేశారు. కాగా రేపు బెంగాల్ లో జరగనున్న భారీ ర్యాలి గురించి కేసీఆర్ తో చర్చించినట్లు సమాచారం. బీజేపీయేతర పార్టీలతో కలిసి బెంగాల్ సీఎం మమత బెనర్జీ యునైటెడ్ ఇండియా పేరుతో రేపు ర్యాలీని నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీకి హాజరుకావాల్సిందిగా కేసీఆర్ ను శుక్రవారం నాడు మమత ఫోన్‌లో ఆహ్వానించారు. ఇప్పటికే దేశంలోని బీజేపీయేతర పార్టీలు, సీఎంలను ఈ ర్యాలీకి హాజరుకావాల్సిందిగా మమత ఆహ్వానాలు పంపారు.

మరో వైపు కేసీఆర్‌కు పంపిన ఆహ్వానం సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు దూరంగా మరో ఫ్రంట్‌ ఏర్పాటుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ ర్యాలీకి తాను దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు కేసీఆర్ మమతకు చెప్పినట్టు తెలుస్తోంది. ఈ ర్యాలీకి కాంగ్రెస్ పార్టీ నేతలు కూడ హాజరుకానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కూడ ఈ ర్యాలీలో పాల్గొంటానని ఇప్పటికే ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ కూడ ఈ ర్యాలీలో పాల్గొంటున్న కారణంగా కేసీఆర్ దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.