'లక్ష్మీస్ ఎన్టీఆర్' నుంచి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్..

SMTV Desk 2019-01-18 19:39:15  Ram Gopal Varma, Lakshmi's NTR, ntr first look

హైదరాబాద్, జనవరి 18: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం దివంగత ఎన్టీఆర్ జీవిత కధ ఆధారంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరిట ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. అయితే ఈరోజు ఎన్టీఆర్ డెత్ యానివర్సరీ సందర్బంగా ఆ చిత్రంలోని ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు. ఈరోజు ఉదయం తన ట్విట్టర్ ఖాతాలో "ఎన్టీఆర్ డెత్ యానివర్సరీ అయిన జనవరి 18న సాయంత్రం 5 గంటలకు లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రాణం పోసుకోబోతోంది" అని మొదట వొక ట్వీట్ చేసారు.తరువాత ఎన్టీఆర్ గారి విశ్వాసాల మీద గౌరవంతో ఈరోజు సాయంత్రం గం.5 లకి బదులుగా సా. 6 గంటల 57 నిమిషాల దివ్యముహూర్తంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ పునర్జన్మదర్శనం అని మరో ట్వీట్ పెట్టారు. ఈ నేపథ్యంలో చిత్రం నుంచి ఎన్టీఆర్ ప్రీ లుక్ ను విడుదల చేస్తారు.