పార్టీ మారిన బీజేపీ ఎమ్మెల్యే....

SMTV Desk 2019-01-18 17:18:13  BJP MLA, Aakula sathyanarayana, Janasena party, Pawan kalyan

రాజమండ్రి, జనవరి 18: ఏపీలో ఎన్నికల సందర్భంగా పార్టీ నేతల వలసలు ఇప్పటికే మొదలయ్యాయి. ఏ నేత ఎప్పుడు తమా పార్టీని వీడి పక్క పార్టీలోకి వెల్తాడో అని పార్టీ నాయకులు అయోమయానికి గురవుతున్నారు. అయితే తాజాగా మరో నెత పార్టీ మారాడు.

బిజెపి ఎమ్మెల్యె ఆకుల సత్యనారాయణ ఈనెల 21న పవన్‌ సమక్షంలో జనసేనలో చేరుతున్నట్లు వెల్లడించారు. రాజకీయ వ్యవస్థను పవన్‌ ప్రక్షాళన చేస్తారని నమ్మకంతో జనసేనలో చేరుతున్నానని ఆయన అన్నారు. పవన్‌ ఎక్కడి నుండి పోటీ చేయమంటే అక్కడి నుండే పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు.