పవన్ కళ్యాణ్ తరువాతి పోరాటం ఏమిటంటే?

SMTV Desk 2017-07-30 16:10:59  JANASENA, PARTY, PAVANKALYAN, VISHAYAPATNAM, Kidney victims, The problems of Nalgonda fluoride victims are solved,Placard, DOCTERS, Interview

విశాఖపట్నం, జూలై 30 : జనసేన అధినేత సినీ నటుడు పవన్ కల్యాణ్ విశాఖపట్టణంలో జనసేన సంయుక్తంగా ఆంధ్రా మెడికల్ కాలేజీ, ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య పరిష్కారం కోసం నిర్వహించిన సదస్సులో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రస్తావిస్తూ...ఉద్దానం కిడ్నీ బాధితులు, నల్గొండ ఫ్లోరైడ్ బాధితుల సమస్యల పరిష్కరం పై డాక్టర్ లతో భేటీ అయ్యారు. అనంతరం ప్రసంగం చివర్లో ఒక ప్లకార్డును ప్రదర్శించి, దానిని చూసి ఆయన మౌనంగా చిరునవ్వులు చిందించారు. ఆ ప్లకార్డులో జనావాసాల మధ్య బ్రాంది షాపు పెట్టరాదు అనే క్యాప్షన్ ఉంది. అయితే, ఏపీలోని సరికొత్త మద్యం పాలసీలో భాగంగా వివిధ ప్రాంతాల్లో మద్యం దుకాణాల ఏర్పాటుకు లైసెన్సులు ఇస్తున్నారని, అవి జనావాసాల మధ్య ఉండడంతో మద్యం దురలవాటు కారణంగా కుటుంబాలు నాశనమైపోతున్నాయని ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాన్ ఈ ప్లకార్డు ప్రదర్శించడం ఆసక్తి రేపుతోంది. జనసేన తరువాత పోరాటం దానిపైనేనని ఆయన పరోక్షంగా చెప్తున్నట్లు సమాచారం.