నెలాఖరున ఏపీ అసెంబ్లీ సమావేశాలు

SMTV Desk 2019-01-18 17:04:32  Andhrapradesh Legislative assembly, AP CM, Chandrababu

విజయవాడ, జనవరి 18: జనవరి 30 నుండి ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తాజాగా దీనికి సంభందించిన తేదీలను, వివరాలను శాసనసభ,మండలి కార్యదర్శులు అధికారికంగా విడుదల చేశారు. ఈ నెల 30 నుండి ఫిబ్రవరి 7 వరకు శాసనసభ, శాసనమండలి సమావేశాలు జరగనున్నాయి.

జనవరి 30 ఉదయం 9.30కు ఉభయసభలు సమావేశ మవుతాయని గవర్నర్‌ నరసింహన్‌ పేరిట నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. ఫిబ్రవరి 2న ప్రభుత్వం ఓటాన్‌ అక్కౌంట్‌ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనుంది. అసైన్డ్‌ భూముల చట్ట సవరణ బిల్లుతో పాటు మరికొన్ని కీలకమైన బిల్లులను కూడ ప్రభుత్వం ఈ సమావేశాల్లో తీసుకొచ్చే అవకాశం ఉంది.