కాంగ్రెస్‌ ఎంపీ అమిత్‌ షాకు క్షమాపణలు చెప్పాలి..

SMTV Desk 2019-01-18 16:34:00  Amit Shah, Swine Flu, BK Hariprasad, contraversial comments, Apology

న్యూఢిల్లీ, జనవరి 18: భాజపా అధ్యక్షడు అమిత్‌ షా అనారోగ్యాన్ని ఉద్దేశిస్తూ కర్ణాటక కాంగ్రెస్‌ ఎంపీ బీకే హరిప్రసాద్‌.. కర్ణాటకలో కాంగ్రెస్‌ - జేడీఎస్‌ కూటమిని చీల్చడానికి యత్నించడం వల్లే అమిత్‌ షా అనారోగ్యం పాలయ్యారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా హరిప్రసాద్‌ను కాంగ్రెస్ పార్టీ జనరల్‌ సెక్రటరీ పదవి నుంచి తొలగించాలంటూ బీజేపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. వొకవేళ హరిప్రసాద్‌ను తొలగించకపోతే ఈ వ్యాఖ్యలకు రాహుల్‌ గాంధీ కూడా మద్దతిస్తున్నట్లు భావించాల్సి వస్తుందని వారు తెలిపారు.

దీని గురించి భాజపా అధికార ప్రతినిధి జీవిఎల్‌ నర్సింహ్మ రావు మాట్లాడుతూ.. ‘రెండు నాలుకల ధోరణిని ప్రదర్శిండం కాంగ్రెస్‌ నేతల స్వభావం అని అన్నారు. వొక వైపు రాహుల్‌ గాంధీ జైట్లీ అనారోగ్యం గురించి విచారం వ్యక్తం చేస్తూంటే.. మరో వైపు హరి ప్రసాద్‌ లాంటి వాళ్లు ఇలా విషం కక్కుతారు. వొక వేళ రాహుల్‌ నిజంగానే హరిప్రసాద్‌ వ్యాఖ్యల్ని సమర్థించకపోతే.. అతని చేత అమిత్‌ షాకు బహిరంగ క్షమాపణలు చెప్పించాల ని డిమాండ్‌ చేశారు.