ప్రజలకే అన్ని నిజాలు చెబుతా...!!!

SMTV Desk 2019-01-18 14:23:36  Srinivasrao, YS Jagan attempt to murder case, CBI, High court, Lawyer saleem

విజయవాడ, జనవరి 18: జగన్ మోహన్ రెడ్డి పై హత్యయత్న కేసు ప్రధాన నిందితుడు శ్రీనివాసరావు పలు ఆశక్తికర వ్యాఖ్యలు చేశాడు. గురువారంతో ఎన్ఐఎ విచారణ పూర్తవడంతో అతన్ని శుక్రవారం ఎన్ఐఎ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. తాను జగన్ పై ఎందుకు దాడి చేశానన్న విషయాన్ని డైరెక్ట్ గా ప్రజలకే చెబుతానని.. తనకు ఆ అవకాశం ఇవ్వాలని శ్రీనివాసరావు ఈ సందర్భంగా కోర్టును కోరాడు. జగన్ పై దాడి చేయడానికి గల కారణాన్ని తాను పుస్తకంలో రాసానని.. ఆ పుస్తకాన్ని జైలు అధికారులు స్వాధీనం చేసుకున్నారని అతను తెలిపాడు. ఆ పుస్తకం తనకు తిరిగి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరాడు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇదిలా ఉండగా.. ఎన్ఐఏ ఈ కేసు విషయంలో నిబంధనలు ఉల్లంఘించిందని శ్రీనివాసరావు తరపు లాయర్ వాదించారు. దాదాపు 30గంటల పాటు తమకు తెలియకుండా రహస్యంగా దాచి పెట్టి మరీ శ్రీనివాసరావుని ఎన్ఐఏ అధికారులు విచారించారని లాయర్ వాదించారు. కాగా, విజయవాడ జైలులో శ్రీనివాస రావు ప్రాణాలకు ముప్పు ఉందని అతని తరఫు న్యాయవాది చెప్పారు. అతనికి భద్రత పెంచాలని, అతన్ని తోటి ఖైదీలతో కలవనీయకూడదని ఆయన కోర్టును కోరారు.