అసెంబ్లీ స్పీకర్ గా పోచారం ఎన్నిక

SMTV Desk 2019-01-18 12:47:20  Pocharam srinivas reddy, Nomination, Telangana assembly speaker, KCR

హైదరాబాద్, జనవరి 18: గురువారం ఉదయం బాన్సువాడ శాసనసభ్యుడు, మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ శాసనసభాపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాక పోచారం తరపున ఆరు ప్రతిపాదనలు సమర్పించారు. కాగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతిగా పోచారం ఎన్నిక కానున్నారు. ఈ పదవికి సీఎం ఆయనను ఎంపిక చేశారు.

అయితే నిన్న సాయంత్రం 5 గంటల వరకు నిర్ణీత గడువులోగా ఆయన వొక్క నామినేషన్‌ మాత్రమే దాఖలైంది. సీఎం కేసీఆర్‌ వినతి మేరకు కాంగ్రెస్‌, భాజపా, ఎంఐఎంలు ఆయనకు మద్దతు తెలిపాయి. దీంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది. సభాపతిగా పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికను శుక్రవారం అధికారికంగా ప్రకటించనున్నారు. అనంతరం ఆయన బాధ్యతలు చేపడతారు.