భారత్ తో తలపడే ఆసిస్ జట్టు...

SMTV Desk 2019-01-17 20:17:28  Team india, Australia, ODI, Australia team

న్యూ ఢిల్లీ, జనవరి 17: భారత్-ఆసిస్ మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో ఇరు జట్ల మధ్య పోరు చాలా రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే చెరో మ్యాచ్ ను గెలుచుకోవడంతో మూడో వన్డే నిర్ణయాత్మకంగా మారింది. ఇప్పటికే స్వదేశంలో టెస్ట్ సీరిస్ కోల్పోయి పరాభవంతో వున్న ఆసిస్ వన్డే సీరిస్‌ను ఎట్టి పరిస్థితుల్లో గెలుచుకోవాలని చూస్తోంది. మరోపక్క టెస్ట్ సీరిస్ గెలిచి... రెండో వన్డేలో కూడా ఆటగాళ్లందరు ఫామ్ లోకి రావడంతో మంచి ఊపుమీదున్న టీంఇండియా కూడా చివరి వన్డే గెలిచి సీరిస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఇలా రేపు(శుక్రవారం) మెల్ బోర్న్‌లో జరగనున్న వన్డేను ఇరుజట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

ఈ క్రమంలో ఇవాళ ఆస్ట్రేలియా టీం మేనేజ్ మెంట్ పలు మార్పులతో జట్టును ప్రకటించింది. అడిలైడ్ లో జరిగిన వన్డే మ్యాచ్ లో భారీ స్కోరును కూడా కాపాడుకోలేకపోయిన ఆసిస్ బౌలర్లపై వేటు పడింది. చెత్త ప్రదర్శనతో పరుగులను సమర్పించుకుని...వొక్క వికెట్ కూడా తీయలేకపోయిన నాథన్ లియాన్ ను తప్పించింది. అంతేకాకుండా వెన్నునొప్పితో బాధ పడుతూ తన బౌలింగ్ పై దృష్టిపెట్టలేక విఫలమవుతున్న జాసన్ బెహ్రండార్ప్ ను కూడా జట్టు నుండి తొలగించింది. వీరి స్థానంలో ఆడం జంపా, బిల్లీ స్టాన్‌లేక్‌లకు జట్టులో చోటు కల్పించారు.

మెల్ బోర్న్ వన్డేలో బరిలోకి దిగనున్న ఆస్ట్రేలియా జట్టిదే...

అరోన్ ఫించ్ (కెప్టెన్)
షాన్ మార్ష్
ఉస్మాన్ ఖవాజా
పీటర్ హ్యాండ్స్‌కోబ్
అలెక్స్ కేరీ (వికెట్ కీపర్)
మార్కస్ స్టోయిన్స్
మ్యాక్స్ ‌వెల్
రిచర్డ్‌సన్
పీటర్ సిడెల్
ఆడం జంపా
బిల్లీ స్టాన్‌లేక్