ఫెడరల్‌ ఫ్రంట్‌ ఓ మాయ లేడిలాంటిది..!!!

SMTV Desk 2019-01-17 19:33:14  TDP MLA, Boda Umamaheshwararao, KCR, YS Jagan, Pawan kalyan, BJP, Federal frunt

విజయవాడ, జనవరి 17: గురువారం ఉదయం టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మీడియాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసిఆర్‌ ఇచ్చే డబ్బుల కోసమే జగన్‌ ఆరాటమని, వ్యతిరేక ఓట్లు చీల్చడం కోసమే ఫెడరల్‌ ఫ్రంట్‌ అని, అది వొక మాయ లేడిలాంటిదని ఆయన అన్నారు.

అంతేకాక ఏపిలో ఓ డమ్మీ ఉండాలని మోది, కేసిఆర్‌ ప్రయత్నాలు చేస్తున్నారని, టిఆర్‌ఎస్‌తో పొత్తుపై జగన్‌ వివరణ ఇవ్వాలని , బిజెపితో జతకట్టిన వైఎస్‌ఆర్‌సిపి, కేసిఆర్‌కు వ్యతిరేకంగా పవన్‌ కళ్యాణ్‌ మాతో కలిసి రావాలని ఆయన అన్నారు.