ఏపీ సీఎం దావోస్ పర్యటన రద్దు

SMTV Desk 2019-01-17 19:15:41  Chandrababu, Dawes tour, Nara lokesh

అమరావతి, జనవరి 17: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన దావోస్ పర్యటనను రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు. ఎన్నికలు, పార్టీ కార్యక్రమాలపై దృష్టి సారించందుకు ఆయన పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలిపారు.

అయితే ఇప్పటికే మంత్రి లోకేష్‌ దావోస్‌ పర్యటన ఖరారైంది. దావోస్‌లో సీఎం హాజరయ్యే సమావేశాల్లో లోకేష్‌ పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఈనెల 21న మధ్యాహ్నం ఏపీ కేబినెట్‌ సమావేశం జరగనుంది.