అఖిల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా ప్రముఖ హీరో..

SMTV Desk 2019-01-17 18:42:01  Akhil, NTR, Mr.Majnu, pre release

హైదరాబాద్, జనవరి 17: అక్కినేని అఖిల్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'మిస్టర్ మజ్ను' చిత్రం నిర్మితమైంది. ఈ సినిమా పూర్తిగా లవ్ అండ్ రొమాన్స్ నేపథ్యంలో సాగనుంది. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో అఖిల్ జోడీగా నిధి అగర్వాల్ నటించింది. ఈ నెల 25వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ సందర్బంగా ఈ నెల 19వ తేదీన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ .. ఫిల్మ్ నగర్లోని జెఆర్సీ కన్వెన్షన్ లో ఈ వేడుకను ఘనంగా నిర్వహించనున్నారు.

19వ తేదీ సాయంత్రం జరిగే ఈ వేడుకకి ముఖ్య అతిథిగా జూ.ఎన్టీఆర్ హాజరుకానున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమా హిట్ కావలసిన అవసరం అఖిల్ కి చాలావుంది. ఇక సవ్యసాచి తో నిరాశ చెందిన నిధి అగర్వాల్ కి కూడా ఈ సినిమా సక్సెస్ చాలా అవసరం. మరి ఈ ఇద్దరి కెరియర్ కి ఈ సినిమా ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.