సచిన్ ను దాటేసిన కోహ్లి రికార్డ్

SMTV Desk 2017-07-30 14:45:06  indian cricketer, virat kohli, sachin, record break

శ్రీలంక, జూలై 30 : భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి బ్యాటింగ్ కు దిగాడంటే చాలు ఎలాంటి పిచ్ అయిన సరే పరుగుల వరద పారాల్సిందే. ఇప్పుడు ఈ క్రికెటర్ సచిన్ పేరిట ఉన్న రికార్డు ను సాధించారు. విదేశాల్లో సచిన్ 19 ఇన్నింగ్స్ ల్లో 1000 పరుగులు చేయగా, ఈ రికార్డు ను కోహ్లి 17 ఇన్నింగ్స్ లోనే 1000 పరుగులు సాధించారు. అదే విధంగా కోహ్లి మరో రికార్డును కూడా సాధించారు. ఛేజింగ్ లో సచిన్ 232 ఇన్నింగ్స్ లో 17 సెంచరీలు చేశారు. ఇప్పుడు ఈ రికార్డు ను కూడా కోహ్లి 102 వన్డేల్లో 18 శతకాలు సాధించడం విశేషం. బ్యాటింగ్ లో మంచి ఫాంలో కోహ్లి ఇంకా ఎన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకుంటారో చూడాలి.