'శ్రీదేవి బంగ్లా'కు నోటీసులు...బోణీ కపూర్ కు ప్రియ ప్రకాష్ రిప్లై

SMTV Desk 2019-01-17 16:53:52  Priya prakash varrier, Bhoni kapoor, Sridevi, Sridevi bungalow

ముంబై, జనవరి 17: ఓవర్ నైట్ స్టార్ ప్రియ ప్రకాష్ వారియర్ కొత్త చిత్రం 'శ్రీదేవి బంగ్లా'. ఈ సినిమా ట్రైలర్ ఈ మధ్యే విడుదలై మంచి రెస్పాన్స్ కాగా వివాదాలకు కూడా దారి తీసింది. ఈ సినిమా టైటిల్ శ్రీదేవి బంగ్లా అని ఉండటం, ట్రైలర్ చివర్లో బాత్ టబ్‌లో పడిపోయి ఓ యువతి చనిపోవటం చూపించటంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇక దీనిపై శ్రీదేవి భర్త బోని కపూర్ ప్రియా వారియర్ కు డైరెక్టర్ ప్రశాంత్ మాంబుల్లికి నోటీసులు జారీ చేశారు. దీంతో ఈ వివాదంపై టాలీవుడ్, బాలీవుడ్‌లో జోరుగా చర్చలు నడుస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ వివాదంపై నటి ప్రియా వారియర్ స్పందించింది. "శ్రీదేవి అనేది ఈ సినిమాలో నా పేరు మాత్రమే. దానికే ఇంత రాద్ధాంతం అవసరమా?. ప్రస్తుతం ట్రైలర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం శ్రేదేవి నేపథ్యంలో ఉందా? లేదా? అనేది విడుదలయ్యాక ప్రేక్షకులే చెప్తారు ఇది వెటరన్ యాక్ట్రస్ శ్రీదేవి గురించా కాదా" అని తెలిపింది. మరి ఇది నిజంగా శ్రీదేవి గురించా కాదా అన్న విషయం తెలియాలంటే సినిమా వచ్చేంత వరకూ ఆగాల్సిందే. చూద్దాం ప్రేక్షకులు ఏం జడ్జిమెంట్ ఇస్తారో..?